Advertisement
Google Ads BL

ఈ ఏడాది సైమా కళకళలు


గత ఏడాది లాక్ డౌన్ తో సినిమా అవార్డ్స్, సినిమా అవార్డ్స్, ఇంకా బుల్లితెర ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. దానితో హీరోయిన్స్ అంతా ఉసూరుమన్నారు. లేదంటే అవార్డు వేడుకల రెడ్ కార్పెట్స్, సినిమా ఈవెంట్స్, ఇలా ఏ ఫంక్షన్ అయినా హీరోయిన్ మెరుపులు, వాళ్ళ గ్లామర్, వాళ్ళ డిజైనేర్ వెర్ డ్రెస్సెస్ తో అదరగొట్టేసేవారు. కానీ లాక్ డౌన్ తో అన్ని వేడుకలు రద్దయ్యాయి. సైమా అవార్డ్స్, ఫిలిం ఫేర్ అవార్డ్స్, సంతోషం అవార్డ్స్.. లక్స్ జీ అవార్డ్స్ అబ్బో చాలా అవార్డ్స్ క్యాన్సిల్ అయ్యాయి. అయితే ఈ ఏడాది సగం గడిచిపోయింది. అంటే ఇక అవార్డ్స్ ఫంక్షన్స్ లేవేమో అనుకుంటున్నారు జనాలు. 

Advertisement
CJ Advs

అయితే ఈ ఏడాది సైమా అవార్డ్స్ ఫంక్షన్ చెయ్యబోతున్నట్టుగా సైమా ప్రకటించింది. సెప్టెంబరు 11, 12న సైమా అవార్డ్స్ ఫంక్షన్స్ ని హైదరాబాద్ లో జరపనున్నట్టుగా ప్రకటించారు. 2012లో ఈ అవార్డుల కార్యక్రమం మొదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా అన్ని కేటగిరీస్ లో సైమా అవార్డ్స్ ఇస్తున్నారు. కొన్నాళ్లుగా దుబాయ్ లో ఈ సైమా వేడుకని నిర్వహిస్తున్న యాజమాన్యం కరోనా కారణంగా ఈ ఏడాది హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. 

SIIMA Awards Announcement:

SIIMA Awards will be held in Hyderabad on September 11th and 12th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs