Advertisement
Google Ads BL

ఐడి కార్డు తో ఆర్.ఆర్.ఆర్ హీరో


రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ టచ్ అదేనండి ఫైనల్ షెడ్యూల్ కోసం ఆర్. ఆర్.ఆర్ హీరోలతో పాటుగా యూనిట్ మొత్తం ఉక్రెయిన్ వెళ్ళింది. అక్కడ రెండు పాటల చిత్రీకరణతో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ కాబోతుంది. అయితే ఉక్రెయిన్ లో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ స్పాట్ లో కొమరం భీం పాత్రధారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐడి కార్డ్ వేసుకుని.. దానిని చూపిస్తూ.. నేను ఐడీ కార్డు వేసుకుని చాలా సంవత్సరాలైంది. తొలిసారి సెట్స్‌లో ఇలా అంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

Advertisement
CJ Advs

మరి స్కూల్ టైం లోనో.. సాఫ్ట్ వేర్ జాబ్స్ లోనో, మారేదన్న జాబ్ చేసేవారో వేసుకునే ఐడి కార్డ్ ని ఎన్టీఆర్ ధరించడం కొత్తగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ మెడలో ఐడి కార్డ్ ఉన్న పిక్ లో వెనకగా.. ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి కూడా తన ఐడి కార్డ్ ని చూపిస్తున్నారు. మరి విదేశాల్లో షూటింగ్స్ చేసే సమయంలో మూవీస్ యూనిట్ మొత్తం ఇలా ఐడి కార్డ్స్ ధరించాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ఐడి కార్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

RRR Hero with ID card:

Young tiger NTR thrilled to wear an ID card after ages
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs