Advertisement
Google Ads BL

మరోసారి ఎన్టీఆర్ అలా


యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాఖి మూవీ, ఆంధ్రావాలా సినిమాల టైం లో బాగా బరువెక్కి మరీ వికారంగా కనిపించేవాడు. అప్పట్లో ఫిట్ నెస్ మీద అశ్రద్ధ, డైట్ పాటించకపోవడంతో ఎన్టీఆర్ మరీ లావుగా తయారయ్యాడు. కానీ రాజమౌళి తన సినిమా యమదొంగలో నటించాలంటే బాగా బరువు తగ్గి సన్నగా తయారైతేనే కుదురుతుంది అని కండిషన్ పెట్టడంతో.. ఎన్టీఆర్ అప్పట్లో బరువు తగ్గడానికి లైపో చేయించుకున్నాడని, బాగా జిమ్ చేసి, బాగా డైట్ చేసి బరువు తగ్గడంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ యమదొంగ టైం లో ఎన్టీఆర్ బాగా సన్నగా కనిపించి షాకిచ్చాడు. ఆ తర్వాత కంత్రి సినిమా కి కూడా అదే బరువు మెయింటింగ్ చేసిన ఎన్టీఆర్ టెంపర్ టైం కి కొద్దిగా ఒళ్ళుచేసాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ కోసం కండలు పెంచి దిట్టంగా కనిపిస్తున్న ఎన్టీఆర్ కొమరం భీం పాత్రకి పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

మరోసారి ఎన్టీఆర్ తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ కోసం ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కోసం పెంచిన కండలు కరిగించబోతున్నాడట. ఎన్టీఆర్ 30 కోసం ఎన్టీఆర్ బరువు తగ్గబోతున్నాడన్నమాట. కొరటాల తన సినిమా కోసం కాస్త బరువు తగ్గమని ఎన్టీఆర్ కి చెప్పడంతో.. ఎన్టీఆర్ కూడా ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ పూర్తికాగానే డైట్ మొదలు పెట్టేసి, వర్కౌట్స్ తో కండలు కరిగించేయ్యబోతున్నాడట. సో ఎన్టీఆర్ కొరటాల తో చెయ్యబోయే పాన్ ఇండియా మూవీలో మరింత షార్ప్ గా స్లిమ్ గా కొత్త లుక్ లో కనిపిస్తాడన్నమాట. 

NTR to shed weight for Koratala?:

NTR changing his habits for his next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs