Advertisement
Google Ads BL

ఏపీలో లాక్ డౌన్?


ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుదలతో.. కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆగష్టు 14 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది అని ప్రకటించింది. కానీ మరోసారి ఏపీలో లాక్ డౌన్ పెట్టె పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. మధ్యాహ్నం వరకే కొన్ని చోట్ల వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వరకే పర్మిషన్ ఇస్తున్నారు. మొత్తమ్మీద సెకండ్ వేవ్ ప్రారంభంలో ఎలా జరిగిందో.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతోంది.

Advertisement
CJ Advs

గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా మరికొన్ని గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటోంది. గుంటూరు నగరంలోని బ్రాడీపేట సహా ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గిపోలేదా..? లేక థర్డ్ వేవ్ మొదలైందా అనే సంశయం ఉండగానే.. అనుకోకుండా లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి రావడం విశేషం. ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఎక్కడికక్కడ అధికారులే చొరవ తీసుకుని నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. స్థానిక నాయకులతో చర్చించి కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్నారు.

Lockdown in AP..?:

High chances of lockdown in AP state
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs