Advertisement
Google Ads BL

కోట్లలో నష్టపోయిన నటి


బాలీవుడ్ బడా బిజినెస్ మ్యాన్, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యి రిమండ్ లో ఉన్నాడు. ప్రస్తుతం రాజ్ కుంద్రా కేసు ముంబై కోర్టులో విచారణలో ఉంది. రాజ్ కుంద్రా అస్లీల చిత్రాలకి చిత్రీకరించి యాప్స్ లో అప్ లోడ్ చేసి కోట్లు సంపాదించారని ఆరోపణలతో జైలు పాలయ్యాక నటి శిల్పా శెట్టి పరిస్థితి దయనీయంగానే మారింది. ఇప్పటివరకు సమాజంలో గౌరవంగా ఉన్న శిల్ప శెట్టి ని ఒక్కసారిగా అందరూ అనుమానించడంతో ఆమె పరువు పోయింది. రాజ్ కుంద్రా అరెస్ట్, శిల్పా శెట్టి ని కూడా ముంబై పోలీస్ లు విచారించడంతో.. శిల్పా శెట్టి ఆర్థికంగానూ నష్టపోయింది. భర్త అరెస్ట్ తో పరువుతోపాటు ఆర్ధికంగానూ నష్టపోయిన శిల్పా శెట్టి నష్టం కోట్లలోనే ఉంటుందట. 

Advertisement
CJ Advs

ఇక శిల్పా శెట్టి బాలీవుడ్ బడా డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ 4 నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత మానసికంగా కుంగిపోయిన శిల్పా శెట్టి.. డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ 4 కి హాజరవడం లేదు. దానితో శిల్పా శెట్టి 2 కోట్ల మేర నష్టపోయినట్లుగా తెలుస్తుంది. వారానికి రెండు ఎపిసోడ్స్, ఎపిసోడ్ కి 18 నుండి 20 లక్షలు ఛార్జ్ చేసే కాస్ట్లీ జేడ్జ్ గా శిల్పా శెట్టి ఆ షోలో ఉంది. శిల్పా శెట్టి రాకపోవడంతో ఆమె ప్లేస్ లో రితేష్ దేశముఖ్, జెనీలియా, కరీనా కపూర్  గెస్ట్ లుగా వస్తున్నారు. 

ఈ షో నుండి శిల్ప తప్పుకోవడం పట్ల శిల్పా బాగా ఫీలవుతుంది అని తెలుస్తుంది. అయితే శిల్పా శెట్టి తప్పుకున్నట్టుగా అధికారిక ప్రకటన కానీ, షో నుండి నిర్వాహకులు ఆమెని తప్పించినట్లుగా ప్రకటన కానీ లేదు. ఇక ఇప్పటికే 2 కోట్లు అంటే.. షో నుండి శిల్పా వెళ్ళిపోతే మరింతగా నష్టపోతోంది అని అంటున్నారు. ఇక శిల్ప శెట్టి నుండి యాడ్స్ కూడా చేజారిపోయినట్లుగా తెలుస్తుంది. 

Actress lost in crores:

Shilpa Shetty to Lose Crores Because of Her Absence From Super Dancer Chapter 4
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs