Advertisement
Google Ads BL

రాజమౌళి 100 కి 200 ఇచ్చినా తక్కువే


టాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు ఏ భాషలో అయినా టాప్ రైటర్ గా కొనసాగుతున్న విజయేంద్ర ప్రసాద్ గారు.. ఈమధ్యన తాను కథ అందించిన ఆర్.ఆర్.ఆర్ పై ఎప్పటికప్పుడు అంచనాలను పెంచేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ హీరోల మధ్యన స్నేహం, వాళ్ళ మధ్యన యాక్షన్ సీన్స్, సీత పాత్రధారి అలియా భట్ ఇలా అప్పుడప్పుడు ఆర్.ఆర్.ఆర్ ముచ్చట్లు మట్లాడుతూ సినిమాపై అందరిలో క్యూరియాసిటీని అంతకంతకు పెంచుతూ పోతున్నారు. అయితే టాప్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారి పారితోషకం గురించి అడిగితే అందరి కన్నా ఎక్కువే అన్నట్టుగా చెప్పిన ఆయన.. తాను రాసే 100 శాతం కథల్లో కేవలం 10 శాతం మాత్రమే తన కొడుకు రాజమౌళి మెప్పు పొందుతాయంటూ చెప్పుకొచ్చారు. 

Advertisement
CJ Advs

తాను చెప్పిన కథ అద్భుతంగా ఉంది అని అనుకుంటే.. ఆ కథని సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు.. నచ్చలేదు అంటే నచ్చలేదు అని మొహం మీదే చెప్పేస్తాడు. ఇక రాజమౌళి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క సినిమా ప్రాణం పెట్టి పని చేశాడు. నేను రాసిన ప్రతి కథకు నా కొడుకు రాజమౌళి అనుకున్నదానికంటే ఎక్కువ స్థాయిలోనే న్యాయం చేశాడు..  నిజంగా ఆ విషయంలో రాజమౌళికి మార్కులు వేయ్యాలంటే గనక 100కి 200లు ఇచ్చినా తక్కువే అని అంటున్నారు. మరి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఫాన్స్ కానీ, రామ్ చరణ్ ఫాన్స్ కానీ జక్కన్న 100 కి 200 మార్కులు ఇస్తారులే.. అంటున్నారు నెటిజెన్స్. 

Vijayendra Prasad says 200 out of 100 to Rajamouli is also not enough:

Vijayendra Prasad says 200 out of 100 to Rajamouli is also not enough
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs