చిరంజీవి పుట్టిన రోజు ఈ నెలలోనే.. ఆగష్టు 22 న మెగాస్టార్ బర్త్ డే కోసం మెగా ఫాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. అందులోను ఆయన నటిస్తున్న సినిమాల లుక్స్ తో సోషల్ మీడియాని షేక్ చెయ్యాలని మెగా ఫాన్స్ ఆరాటపడుతున్నారు. చిరు పుట్టిన రోజు స్పెషల్ గా ఆచార్య డేట్ తో పాటుగా ఆయన చెయ్యబోయే లూసిఫర్ నుండి ఓ స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులని దర్శకుడు మోహన్ రాజా ఓ రేంజ్ లో మొదలు పెట్టేసారు.
అయితే చిరు బర్త్ డే రోజున లూసిఫర్ టైటిల్ అండ్ లుక్ వదలబోతున్నట్టుగా టాక్. మెగాస్టార్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా కథని బట్టి తెలుగులో ఈ రీమేక్ కి గాడ్ ఫాదర్ టైటిల్ పెడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారట. సో గాడ్ ఫాదర్ టైటిల్ తో పాటుగా చిరు లుక్ కూడా చిరు పుట్టిన రోజుకి రావొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఆచార్య అప్ డేట్ కూడా అప్పుడే ఇస్తారని, ఆ అప్ డేట్ లో ఆచార్య రిలీజ్ డేట్ ఇస్తారని మాత్రం తెలుస్తుంది.