Advertisement
Google Ads BL

బాలీవుడ్ లో రామ్ చరణ్‌ క్రేజ్


రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా నుంచి ‘దోస్తీ’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నుంచి వస్తున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ఆర్‌ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు జక్కన. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లురి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ గిరిజన యోధుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాదు యావత్ భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చిన అది సంచలనంగా మారుతుంది. భీమ్ ఫర్ రామరాజు అంటూ రామ్‌ చరణ్‌పై టీజర్ వదిలినా.. ఆ తర్వాత మధ్యలో కొన్ని పోస్టర్లు ఇచ్చి.. రామరాజు ఫర్ భీమ్ అంటూ ఎన్టీఆర్‌పై టీజర్ వదిలిన అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటి మధ్యలో వచ్చిన ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్‌ల ఫస్ట్‌లుక్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. దోస్తీ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని చిత్ర యూనిట్ స్నేహితుల దినోత్సవం రోజున విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లు ఈ పాటను పాడారు.

అయితే తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా.. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది. అంటూ రాహుల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Ram Charan‌ Craze in Bollywood:

Bollywood Film Analyst Praises Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs