Advertisement
Google Ads BL

బంగార్రాజులో బిగ్ బాస్ బ్యూటీ


నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో ఈ నెలలోనే మొదలు కాబోతున్న బంగార్రాజు సినిమా పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. నాగ్ - కళ్యాణ్ కృష్ణ కాంబోలో సోగ్గాడే చిన్ననాయన సినిమా రావడం మంచి హిట్ కొట్టడంతో ఇప్పుడు బంగార్రాజు పై అంచనాలు మొదలైపోయాయి. ఇక ఈ సినిమాలో నాగార్జునకి వైఫ్ గా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాగ చైతన్యకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నదనే న్యూస్ నడుస్తుంది. ఇంకా ఐదారుగు హీరోయిన్స్ బంగార్రాజు సినిమాలో గెస్ట్ అపీరియెన్స్ ఇవ్వబోతున్నారు అని కూడా అంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ బంగార్రాజులో ఓ స్పెషల్ సాంగ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ లో గ్లామర్ గా అదరగొట్టేసిన మోనాల్ బయటికొచ్చాక కూడా గ్లామర్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది. అలాగే బెల్లంకొండ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసి ఇరగదీసింది. ఆ సినిమా ప్లాప్ అయినా.. మోనాల్ సాంగ్ హిట్ అయ్యింది. ఇక తాజాగా నాగ్ బంగార్రాజు లోను మోనాల్ ఓ స్పెషల్ సాంగ్ కి నర్తించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కూడా స్వర్గంలో నాగ్ బంగార్రాజుగా రంభ పాత్రలో మోనాల్ తో కాలు కదపబోతున్నాడంటున్నారు. 

Nagarjuna to enjoy Monal special in Bangarraju:

Monal Gajjar special song in Bangarraju
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs