బిగ్ బాస్ ఫేమ్ యషిక ఆనంద్ ఈమధ్యనే రోడ్డు ప్రమాదానికి గురై చెన్నై లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో క్రిటికల్ కండిషన్ నుండి బయట పడింది. గత కొన్నిరోజులుగా ఐసియు లో చికిత్స పొందుతున్న యాషిక ఆనంద్ ఈ రోజే సాధారణ వార్డ్ కి షిఫ్ట్ చేసారు. చెన్నై సమీపంలో యషిక నడుపుతున్న కారుకు ఘోర ప్రమాదం జరగడంతో యషిక స్నేహితురాలు ఆ ప్రమాదంలో అక్కడిక్కడే మరణించింది. యషిక తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైంది. అయితే యషిక మద్యం తాగి కారు డ్రైవ్ చేసింది అంటూ వార్తలొచ్చాలి. పోలీస్ లు కూడా ఆమెపై మూడు కేసులు పెట్టారు. అలాగే ఆమె డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేసారు. తాజాగా సాధారణ వర్డ్ లోకి వచ్చిన యషిక ఈ ప్రమాదంపై పెదవి వివిప్పింది.
నేడు అంటే ఆగష్టు 3 యషిక పుట్టిన రోజు. అయితే సాధారణ వార్డ్ కి షిఫ్ట్ అయిన యషిక ఆనంద్ ఓ సుదీర్ఘమైన లేక రాసింది. అందులో తన వలన తన స్నేహితురాలు మృతి చెందడం బాధగా ఉంది అని.. ఈ టైం లో నేను ఎలా ఉన్నానో తెలుసు. నీవు నన్ను ఎప్పటికి క్షమించవని తెలుసు. నన్ను క్షమించు, నేను మీ కుటుంబాన్ని ఇంత గడ్డు పరిస్థితుల్లోకి తీసుకొచ్చాను. నీ మరణం నాకు ఎప్పటికి బాధనే మిగులుస్తుంది. నేను నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నాను, సజీవంగా ఉన్నందుకు నన్ను ఎప్పుడూ నిందించుకుంటానని తెలుసుకో. నీ ఫ్యామిలీ కి నీవు లేని లోటు పూడ్చలేనిది... అంటూ లెటర్ రాసింది
ఇక ఇన్స్టా లో నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తాగి లేను, అది పోలీస్ లు నిర్దారించారు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఈపాటికి నేను కటకటాల వెనుక ఉండే దానిని. నా మీద కాస్త దయ చూపండి, పుకార్లు వ్యాప్తి చెయ్యొద్దు. అలాగే మరొక పోస్ట్ లో యషిక ఆనంద్ తనకి తగిలి దెబ్బలపై కూడా చెప్పుకొచ్చింది. తాను ఓ ఐదు నెలల వరకు నడవలెనని, చాలా రోజులు ఒకే మంచంలో గడపవలసి వస్తుందని.. వెనుక భాగం మొత్తం గాయమైంది అని, నేను చాల తీవ్రంగా గాయపడినా మొహం మీద ఎలాంటి గాయాలు కాలేదు అని, నాకు ఖచ్చితంగా పునర్జన్మ అని, దేవుడు మానసికంగా, శారీరకంగా తనని శిక్షించాడంటూ యషిక ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.