Advertisement
Google Ads BL

గ్లామర్ గర్ల్ కెరీర్ సూత్రాలు


ఒకప్పుడు బాబ్లీ గర్ల్ అంటూ ట్రోల్ చేసిన రాశి ఖన్నా ని ఇప్పుడు నాజూకు సుందరి అంటూ పొగిడేస్తూన్నారు. రవితేజ, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించినా లక్కు కలిసిరాక రాశి ఖన్నా సైలెంట్ గా బరువు తగ్గి స్లిమ్ లుక్ తో షాకిచ్చింది. దానితో కెరీర్ టర్న్ అయ్యింది. ఒక్కసారిగా పాప తెలుగు, తమిళ సినిమాలతో బిజీ అయ్యింది. అంతేకాదు.. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిలతో వెబ్ సీరీస్ కూడా చేస్తుంది. మధ్య మధ్యలో స్లిమ్ లుక్ తో సోషల్ మీడియాలో అదరగొట్టేస్తున్న రాశి ఖన్నా అనుభవం పెరిగేకొలది కొత్త మార్గాలు అన్వేషించాలి అని చెబుతుంది. 

Advertisement
CJ Advs

హీరోయిన్ గా ఎక్కువ కాలం కెరీర్ ని కొనసాగించడం కష్టము. కెరీర్ మొదట్లోనే గ్లామర్ పాత్రాలు, పెరఫార్మెన్స్ పాత్రలతోనూ పేరు తెచ్చుకుని ఉండొచ్చు. కానీ ఓ టైం వచ్చాక డిఫ్రెంట్ గా ఆలోచించాలి అని చెబుతుంది. ఎప్పటికి కమర్షియల్ హీరోయిన్ గానే కొనసాగుతాను, గ్లామర్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తానంటే కుదరదు. నటనను, గ్లామర్ ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్తేనే హీరోయిన్ గా కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించగలుగుతాం. నటిగా ఓ ఇమేజ్‌లో చిక్కుకుపోకుండా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం ఇలాంటి వాళ్లమని, ఇలానే నటించగలుగుతామని ఓ ప్రత్యేక ముద్ర ఉండదో.. అప్పుడే కొత్తతరహా కథాంశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటూ కెరీర్ గురించి సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. 

Rashi khanna says career:

Rashi Khanna With Clarity On Her Career
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs