Advertisement
Google Ads BL

జాన్వీ కపూర్ కి కాబోయేవాడు ఎలా ఉండాలంటే


శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రొసెస్ లో ఉంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో జిమ్ వెర్ తోనే కాదు.. ఈమధ్యన బికినీ షోస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేసే జాన్వీ కపూర్.. తన పెళ్లి ఎక్కడ చేసుకోవాలి, తనకు కాబోయే వరుడు కి ఉండాల్సిన లక్షణాలు గురించి చెబుతుంది. అయితే జాన్వీ కపూర్ తన పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలనుకుంటుందట. మరి జాన్వీ అలా చెప్పి నిజం గానే షాకిచ్చింది. ఎందుకంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గరనుండి.. మిగతా భాషల హీరో, హీరోయిన్స్ తమ తమ పెళ్ళిళ్ళని డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ చాలా రిచ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

కానీ జాన్వీ కపూర్ మాత్రం తన పెళ్లిని తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగాలని ఎప్పటి నుండో కోరుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన పెళ్లి, కాబోయే వరుడు ఎలా ఉండాలని కోరుకుంటుందో చెప్పుకొచ్చింది. తన పెళ్లి తిరుపతిలో చాలా సింపుల్ గా అంటే పెళ్లి తంతు రెండు మూడు రోజుల్లో ముగిసిపోవాలని చెప్పిన జాన్వీ కపూర్.. తన బ్యాచులర్ పార్టీని మాత్రం తన గ్యాంగ్‌తో కలిసి కాప్రి ఐల్యాండ్‌లో ఓ ప్రైవేట్‌ బోట్‌లో చేసుకున్నాక తిరుపతిలో పెళ్లి అంటుంది. 

తన మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు మాత్రం తన తల్లి నివసించిన చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న ఇంటిలో జరగాలి అని.. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది జాన్వీ కోరికట. ఇక తాను పెళ్లి చేసుకోబోయేవాడికి  తెలివితేటలు ఉంటే చాలంటుంది ఈ క్యూట్ జాన్వీ కపూర్.  

Janhvi Kapoor dream wedding:

Marriage at Tirupati & mehendi at Sridevi Mylapore home: A sneak peek into Janhvi Kapoor dream wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs