ఎప్పుడో మార్చ్ లోనే ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ప్రశాంత్ నీల్ సలార్ మూవీ షూటింగ్ మధ్యలో సెకండ్ వేవ్, అలాగే ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్, ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ మూవీ షూటింగ్స్ తో ఆగింది. అయితే సెకండ్ వేవ్ తగ్గి అందరూ షూటింగ్స్ మొదలు పెట్టగా ప్రభాస్ కూడా రాధేశ్యామ్ బ్యాలెన్స్ షూట్ మొదలు పెట్టడం, దానిని ఫినిష్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ రోజే సలార్ షూట్ రెస్యూమ్ అంటూ టీం అప్ డేట్ ఇచ్చేసింది.
యాక్షన్ సీక్వెన్స్ తో సలార్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ రోజు సలార్ సెకండ్ షెడ్యూల్ మొదలు కాబోతుంది అంటూ అప్ డేట్ ఇచ్చేసారు. ఇక ఈ షెడ్యూల్ లోనే శృతి హాసన్ కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ మాస్ గా సలార్ లో కనిపించబోతున్నాడు. శృతి హాసన్ కూడా సలార్ లో యాక్షన్ చెయ్యబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సలార్ లో ప్రభాస్ తో తలపడబోయే పవర్ ఫుల్ విలన్ గురించిన సస్పెన్స్ ఇంకా వీడలేదు.