టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు ఈమధ్యన తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. తన ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలను థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో రిలీజ్ చేసి అందరికి షాకిచ్చిన సురేష్ బాబు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి తనని హీరో చెయ్యాలనుకున్నారని, ఇంకా చాలామంది తనని హీరోని చేసేందుకు సపోర్ట్ చేసినా తాను మాత్రం నిర్మాతగానే సెటిల్ అయ్యా అని, తాను అనుకున్నది నిర్మాతగా సాధించాను అని చెప్పిన సురేష్ బాబు పరసనల్ లైఫ్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసారు.
అది తాను చెడు అలవాట్లకు బానిసని కాలేదని, తన పిన్ని జీవితం తాగుడు వలనే నాశనం అయ్యింది అని, పిన్ని భర్త తాగుబోతు కావడంతో తన పిన్ని జీవితం నాశనం అయ్యింది అని అందుకే అలాంటి అలవాట్లని దరి చేరనియ్యలేదని చెబుతున్నారు సురేష్. అంతేకాకుండా తనకి ఒక ఏజ్ లో ఉన్నపుడు అఫైర్స్ పెట్టుకునే అవకాశం ఉన్నా తాను అలాంటి పని చెయ్యలేదని చెప్పి షాక్ ఇచ్చారు. లైఫ్ లో ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. తన లైఫ్ లోకి వహ్చే భార్యకు అన్యాయం చేయకూడదని ముందుగానే నిర్ణయించుకున్నా అని అందుకే అలా చెయ్యలేదని.. తనకు వచ్చే భార్య మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటే దానిని భరించగల శక్తి ఉంటే.. అప్పుడు తాను కూడా వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవాలని అనుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు సురేష్ బాబు.