యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్ నుండి దోస్తీ సాంగ్ రిలీజ్ అవ్వడమే కాదు.. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ.. రామ్ చరణ్ తో చెయ్యి కలిపే షాట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. మరో మూడు నెలల్లో ఆర్.ఆర్.ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొమరం భీం గా ఎన్టీఆర్ లుక్స్, సిక్స్ ప్యాక్ బోడి అన్ని ఫాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక నేడు ఆర్.ఆర్.ఆర్ దోస్తీ సాంగ్ తో ఎన్టీఆర్ ఫాన్స్ కి సూపర్ ఫీస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో తో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చేసాడు.
ఎవరు మీలో కోటీశ్వరులు నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో ఓ టీచర్ కరోనా పరిస్థితుల కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. దీంతో రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని నడుపుతుంటాడు. అతనికి ఎవరు మీలో కోటీశ్వరులు ఛాన్స్ వస్తుంది. ఈ షో లో ఆ టీచర్ 25 లక్షలు గెలుస్తాడు. ఆ డబ్బులు ఏం చేస్తారు మాస్టర్ అని ఎన్టీఆర్ అనగానే.. ఆ డబ్బులో సగం స్టూడెంట్లకు ఇస్తానని అంటాడు. దానితో ఎన్టీఆర్ ఆ మాస్టర్ ని తెగ అభినందించేసాడు. ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఎన్టీఆర్ స్టయిలిష్ గా చేసిన ప్రోమో వైరల్ అయ్యింది. ఇక ఈ షో ఈ నెలలోనే మొదలు కాబోతున్నట్టుగా ప్రకటించారు.