Advertisement
Google Ads BL

దుల్కర్ జోడిగా మృణాల్ ఠాకూర్‌


దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా సినిమా బ్యాన‌ర్స్‌పై అశ్వినీ ద‌త్‌, ప్రియాంక ద‌త్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. కాగా.. ఈ రాముడి స‌ర‌స‌న సీత‌గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ న‌టిస్తోంది. హృతిక్ రోష‌న్ సూపర్ 30, జాన్ అబ్రహం బాట్లా హౌస్.. పర్హాన్ అక్తర్ తుపాన్ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి మెప్పించిన మృణాల్ తొలిసారి ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

Advertisement
CJ Advs

ఆదివారం మృణాల్ ఠాకూర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఆమె  చేస్తున్న సీత పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అద్దంలో నుంచి మృణాల్ ఠాకూర్ ఫొటోను తీస్తున్న దుల్క‌ర్ స‌ల్మాన్‌.. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకునేలా ఉన్న ఆ లుక్ స్క్రీన్‌పై ఓ ఫ్రెష్ అప్పియ‌రెన్స్‌నిస్తుంది. వీరిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో త‌నెంటో ప్రూవ్ చేసుకున్న మృణాల్ ఠాకూర్‌కి ఇది టాలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ అని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన దుల్క‌ర్ స‌ల్మాన్ ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచింది. ఇప్పుడు మృణాళిని గ్లింప్స్ ఈ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచాయి. రొమాంటిక్ చిత్రాల‌ను  తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన శైలిని చాటుకున్న ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్రేమ కోణాన్ని చూపించ‌బోతున్నారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ నిర్మిస్తోన్న 7వ చిత్ర‌మిది. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గానే ఈ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

Mrunalini Thakur As Lieutenant RAM Sita In Dulquer Salmaan Film:

<span>Birthday Glimpse To Introduce Mrunalini Thakur As Lieutenant RAM Sita In Dulquer Salmaan Film</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs