Advertisement
Google Ads BL

RRR దోస్తీ సాంగ్: మాములుగా లేదుగా


సంగీత ప్రియులు, ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్, ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్.ఆర్.ఆర్ దోస్తీ సాంగ్ అనుకున్న టైం కి అనుకున్నట్టుగా రివీల్ చేసింది టీం. నేడు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుండి దోస్తీ సాంగ్ ని వదలబోతున్నట్టుగా ఆర్.ఆర్.ఆర్ టీం గత నాలుగు రోజులుగా అటెంక్షన్ క్రియేట్ చేసింది. నేడు ఆదివారం 11 గంటలకు ఆర్.ఆర్.ఆర్ నుండి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో సింగర్ హేమ చంద్ర పాడిన దోస్తీ సాంగ్ ని రివీల్ చేసారు. 

Advertisement
CJ Advs

అనుకున్న అంచనాలకు మించి ఆర్.ఆర్.ఆర్ దోస్తీ సాంగ్ ఉంది. ఈ పాటని హేమచంద్ర ఆలపించగా.. ఆయన టీం తోనూ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ఇంకా యాజిన్‌ నైజర్‌ కన్నడ, విజయ్‌ ఏసుదాస్‌ మలయాళం, అమిత్‌ త్రివేది హిందీ ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఈ పాటను హుషారెత్తించేలా పాడించడమే కాదు.. దానికి సంబందించిన సాంగ్ చిత్రీకరణ వీడియో కూడా అదిరిపోయింది. రామ్‌చరణ్‌ - తారక్‌ల స్నేహానికి ప్రతీకగా ఈ సాంగ్ ఉండబోతుంది. మామూలుగానే చరణ్ - తారక్ లు మంచి ఫ్రెండ్స్. 

ఈ సినిమాలోనూ ఫ్రెండ్స్ గా నటించారు. అందుకే రాజమౌళి ఇండియా మొత్తం ఆర్.ఆర్.ఆర్ గురించి మట్లాడుకునేలా ఈ ఆర్.ఆర్.ఆర్ సాంగ్ ని వదిలారు. ఇక సాంగ్ చివరిలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ చాలా స్టయిలిష్ గా నడుచుకుంటూ వచ్చి కీరవాణి భుజం మీద చెయ్యి వేసే షాట్ ఫాన్స్ కి పండగే. ఎన్టీఆర్ అండ్ చరణ్ లు చెయ్యి కలిపే షాట్ తో సాంగ్ పూర్తయ్యింది. 

Dosti Song: First song from Ram Charan and Jr NTR starrer RRR:

The first number from SS Rajamouli, Jr NTR and Ram Charan starrer RRR released on Friendship Day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs