Advertisement
Google Ads BL

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన హీరో


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రామోజీ ఫిలింసిటీలో  మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సోషల్ మీడియాలో మనం వివిధ రకాల చాలెంజ్ లు చూస్తూ ఉన్నామని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చాలెంజ్ అని అన్నారు.

 మనము రోజు చూస్తున్నామని వాతావరణ కాలుష్యం ఏ విధంగా తయారవుతుందో దీన్ని సంరక్షించాలి అంటే మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.

మాలాంటి సెలబ్రిటీస్ ద్వారా ఇది ప్రజల్లోకి వెళితే ఇంకా అద్భుతంగా విజయం సాధిస్తుందన్న ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందు తీసుకోనిపోవడం చాలా సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలిపారు.

నాకు ఈ చాలెంజ్ ఇచ్చిన నా సహచర నటుడు శత్రువు కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ ఛాలెంజ్ విధంగా ముందుకు కొనసాగాలని అందుకోసం నేను నా సహచర నటుడు అయిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్ హీరో, ఆకాంక్ష సింగ్ హీరోయిన్, నిక్కీ గల్ రాణి హీరోయిన్, రాహుల్ రవీంద్ర హీరో లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ వృక్ష వేదం పుస్తకాన్ని ఆది పినిశెట్టి గారికి అందజేయడం జరిగింది.

వృక్ష వేదం పుస్తకాన్ని చూసి చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

Aadhi accepted Greenindia Challenge :

Aadhi Pinishetty accepted Hara Hai Toh Bhara Hai Greenindia Challenge 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs