Advertisement
Google Ads BL

దాసరి కొడుకులపై కేసు


సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు అనారోగ్యం తో కన్ను మూయడంతో ఆయన ఇంట్లో ఆయన ఇద్దరు కొడుకులు ఆస్తి తగాదాలతో రోడ్డెక్కారు. మోహన్ బాబు లాంటి పెద్దమనుషులు అప్పట్లో ఆ పరిస్థితులని చక్కబెట్టి.. దాసరి కొడుకుల రచ్చ ని ఆపారు. అయితే తాజాగా దాసరి నారాయణరావు కొడుకులు మీద ఇప్పుడు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామంటూ దాసరి కొడుకులు తనని బెదిరిస్తున్నారంటూ.. ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్న అట్లూరి సోమశేఖర్‌రావు అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

Advertisement
CJ Advs

అట్లూరి సోమశేఖర్‌రావు దాసరి గారితో బాగా సన్నహితుడుగా ఉండేవారట. దాసరి నారాయణరావు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు సోమశేఖర్‌రావు దగ్గరనుండి చాలాసార్లు 2.10 కోట్లు అప్పు తీసుకున్నారు. అయితే దాసరి నారాయణరావు అనారోగ్యంతో కన్నుమూసాక సెటిల్మెంట్ లో దాసరి కొడుకులైన దాసరి ప్రభు, అరుణ్‌ 2.10 కోట్ల బదులు 1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినా.. ఇంతవరకు ఆ డబ్బు సోమశేఖర్ కి చెల్లించకపోవడంతో.. సోమశేఖర్  జూబ్లీహిల్స్‌ లోని దాసరి నివాసానికి వెళ్లి ప్రభు, అరుణ్‌ను డబ్బులు ఇవ్వమని అడగగా.. మరోసారి అప్పు కట్టాలంటూ ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు భయపెట్టడంతో సోమశేఖర్ భయపడి జూబ్లీహిల్స్ పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. 

Case Registered Against Dasari Narayana Rao Sons:

Hyd police file case on Dasari sons
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs