Advertisement
Google Ads BL

సర్కారు వారి పాట ఫస్ట్ నోటీసు వచ్చేసింది


మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో ఈ జనవరిలో మొదలైన క్రేజీ మూవీ సర్కారు వారి పాట మూవీ షూటింగ్ సెకండ్ వేవ్ లేకపోతె.. ఈపాటికి ఓ కొలిక్కి వచ్చేసేది. కానీ సెకండ్ వేవ్, యూనిట్ లో కొంతమందికి కరోనా రావడంతో షూటింగ్ ఆపాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గానే పోస్ట్ కరోనా షూట్ తో పట్టాలెక్కిన సర్కారు వారి పాట నుండి అప్ డేట్ కోసం ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బర్త్ డే బ్లాస్ట్ అంటూ సర్కారు వారి పాట ఫస్ట్ నోటీసు అంటూ గత రెండు రోజులుగా మహేష్ ఫాన్స్ లో ఆత్రుత, ఆసక్తిని రేకెత్తిస్తుంది టీం. 

Advertisement
CJ Advs

ఆగష్టు 9 న మహేష్ పుట్టిన రోజుకి పది రోజులు ముందే సర్కారు వారి పాట ఫస్ట్ నోటీసు అంటూ మహేష్ బాబు లుక్ ని రివీల్ చేసింది టీం. రెడ్ కలర్ కారులోనుండి చాలా స్టయిలిష్ గా డోర్ తీసి బయటికి చూస్తూ దిగుతూన్న మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ ఫాన్స్ నే కాదు అందరిని ఆకట్టుకుంటుంది. ప్రీ లుక్ తోనే రఫ్ గా చూపించిన పరశురామ్.. సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ లో మహేష్ ని మాస్ గాను, సూపర్ స్టైలిష్ గాను పరిచయం చేసాడు. 

ఈ ఫస్ట్ నోటీసు లోనే మరోసారి రిలీజ్ డేట్ జనవరి 13 2022 ని గుర్తుచేసింది టీం. ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న నేరాల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైం కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది.  

SuperStar Mahesh has Landed in Style Smiling :

Sarkaru Vaari Paata First Notice Arrives with release date 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs