తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కరోనా లాక్ డౌన్ తర్వాత పబ్ లకి, హోటల్స్ కి అనుమతులు ఇచ్చేవారు.. థియేటర్స్ ఓపెన్ చెయ్యడానికి అనుమతులు ఇవ్వడం లేదని, పబ్ లు, రెస్టారెంట్స్ కన్నా థియేటర్స్ సేఫ్ అని, సినిమా వలన అనేకమంది జీవనోపాధి పొందుతున్నారు అంటూ హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ మొత్తానికి వినసొంపుగా వినిపించాయి. అంతేకాదు.. స్టార్ హీరోలు మాట్లాడలేని టైం లో హీరో నాని థియేటర్స్ వ్యవస్థ గురించి మట్లాడడం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి నచ్చింది. నాని తో గొంతు కలిపితే అందరికి న్యాయం జరిగింది అన్నారు.
అయితే నాని స్పీచ్ సినిమా ఇండస్ట్రీకి నచ్చినా.. సాధార ప్రేక్షకుడు మాత్రం నాని వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంటే వ్యవసాయం చేసే రైతులు కష్టపడి చెమటోడ్చినా.. పండే పంటలకు, కనీస ధర ఇవ్వడం లేదని, రైతు ఆత్మహత్యలు జరుగుతూన్నా మాట్లాడని వారు. ఒక్క సినిమా తీసి కోట్లు వెనకేసుకుని.. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, రైతు పక్షాన మాట్లాడడం చేతకాని వారు కోట్లు సంపాదిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం నవ్వు తెప్పిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఓ ప్రేక్షకుడు ఆవేదన చెందుతున్నాడు.