Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్ హీరోల సాహసం


ప్రస్తుతం ఇండియా లో సెకండ్ వేవ్ ఓ కొలిక్కి రావడం, అన్ని రాష్ట్రాల ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్న టైం లో కేరళ లాంటి రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు మొదలయ్యాయి. ఇప్పటికే కేరళలో శని, ఆదివారాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్ అలాగే అన్ని భాషాల్లో ఇండస్ట్రీ హీరో లు తమ సినిమాల సెట్స్ లో షూటింగ్స్ చేసుకుంటున్నారు. అయితే ఎక్కడివారు అక్కడే షూటింగ్ చేసుకుంటున్న టైం లో ఆర్.ఆర్.ఆర్ హీరోలు మాత్రం సాహసం చేస్తున్నారు. రెండు వారల క్రితం హైదరాబాద్ లో ఆర్.ఆర్.ఆర్ షూట్ రెస్యూమ్స్ అంటూ చిత్రకరణ మొదలు పెట్టి ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసేసారు. 

Advertisement
CJ Advs

ఇక ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌ ప్రారంభిస్తారని తెలుస్తుంది. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నప్పటికీ..  ఆర్.ఆర్.ఆర్ బృందం ఉక్రెయిన్‌కి బయలుదేరిందని... ఒకటో తేదిన హీరోలు, దర్శకుడు రాజమౌళి ఉక్రెయిన్ చేరుకుని ఆగష్టు రెండు నుండి షూటింగ్‌ మొదలుపెడతారని సమాచారం. ఆగస్ట్‌ రెండోవారం వరకూ అక్కడ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఈ కరోనా పరిస్థితుల్లో హీరోలు, ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం అక్కడకి వెళ్లడం నిజంగానే సాహసం అనే చెప్పాలి. 

RRR team flies to Ukraine:

RRR heads to Ukraine for a song shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs