ముంబై లో బడా బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఆయన భార్య శిల్పా శెట్టిని మీడియా ఆడుకుంటుంది. శిల్ప శెట్టి కూడా రాజ్ కుంద్రా అస్లీల కేసులో లావాదేవీలు జరిపినట్టుగా.. ఆమె బ్యాంకు ఖాతాలను ముంబై పోలీస్ లు సీజ్ చెయ్యడమే కాదు.. ఆమె ని విచారించడానికి పిలవబోతున్నట్టుగా.. ఇలా మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. రాజ్ కుంద్రా కేసులో కీలక ఆధారాలు లభ్యం అవడం, ఇంకా పలు కేసులలో రాజ్ కుంద్రా ఇరుక్కోవడం, ఇలాంటి కథనాలు ఉన్నది ఉన్నట్టుగా మీడియా ప్రసారం చేస్తుంటే.. మీడియా కథనాల వలన పరువు పోయింది అంటూ మీడియా సంస్థలపై శిల్పా శెట్టి పరువు నష్టం కేసు వేసింది. 25 కోట్లకు పైగా శిల్పా శెట్టి పరువు ష్టం కేసు వెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
నేడు ఈ కేసుపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసు వర్గాలను సంప్రదించాకే మీడియా ఏదైనా వార్తలను ప్రసారం చేస్తే అది ఎలా తప్పు అని హైకోర్టు శిల్పా శెట్టి న్యాయవాదిని ప్రశ్నించింది. మీ క్లయింట్ భర్త రాజ్ కుంద్రా పై తీవ్రమైన కేసు ఉన్న కారణంగానే మీడియా రాతలు రాస్తుంది. మీడియా సంస్థలపై కేసుని హై కోర్టు జోక్యం చేసుకోదు. ఇండియాలో మీడియా సంస్థలకు స్వేచ్ఛ ఉంది. మీడియా ఈ కేసుని కవర్ చేస్తుంది. మీడియా చేసే పనికి కోర్టు అడ్డు చెప్పదు.. అంటే ఈ కేసులో కోర్టు జోక్యం ఉండదు అంటూ హై కోర్టు చెప్పడం ఇప్పుడు శిల్పా శెట్టికి షాక్ ఇచ్చినంత పనయ్యింది.