Advertisement
Google Ads BL

జైలులో ఉమా ప్రాణాలకు ముప్పు


రెండు రోజుల క్రితం అరెస్ట్ అయ్యి.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో పోలీస్ కష్టడీలో ఉన్న టీడీపీ నేత దేవినేని ఉమా ప్రాణాలకు ముప్పు ఉందని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ ప్రాణానికి హాని తలపెట్టేందుకే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాజారావును ఆకస్మిక బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. 

Advertisement
CJ Advs

కొండపల్లి ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలను ప్రశ్నించినందుకే ఉమపై వైసీపీ మూకలు దాడిచేశాయని ఆయన దుయ్యబట్టారు. ఉమపై కక్షతోనే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. రాజకీయ ప్రత్యర్థులను జైళ్లలో హతమార్చిన చరిత్ర వైసీపీ పాలకులకు ఉందన్నారు. ఉమ ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ఆకస్మిక బదిలీపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Devineni life threatened in Rajahmundry jail:

TDP Devineni Uma Shifted to Rajahmundry Central Jail
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs