Advertisement
Google Ads BL

ఏకే రీమేక్: పవన్ వైఫ్ గా హీరోయిన్ ఎంట్రీ


పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో రీసెంట్ గా షూట్ రెస్యూమ్స్ తో మొదలైన అయ్యప్పన్ కోషియం రీమేక్ భీమ్లా నాయక్ యాక్షన్ మోడ్ లో ఉంది. రానా - పవన్ కాంబో సీన్స్, వారి మధ్యన యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సాగర్ కె చంద్ర. తాజాగా ఏకే రీమేక్ సెట్స్ లోకి కెమెరా మ్యాన్ జాయిన్ కాగా.. ఇప్పుడు పవన్ వైఫ్ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ని అఫీషియల్ గా ఆహ్వానించింది టీం. కీలకమయిన పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో సాయి పల్లవి, కీర్తి సురేష్ ల పేర్లు బాగా ప్రచారంలోకి వచ్చినా.. ఫైనల్ గా ఆ ప్లేస్ లోకి నిత్యా మీనన్ వచ్చింది. 

Advertisement
CJ Advs

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యా మీనన్ నటించబోతుంది. రానా కి వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఇక తాజాగా నిత్యా మీనన్ కూడా ఏకే రీమేక్ సెట్స్ అడుగుపెట్టడానికి రెడీ అయ్యింది. అదే విషయాన్నీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాలో కథానుసారం పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్ లకి ఓ బిడ్డ కూడా ఉంటుంది. మరి వారి కాంబో సీన్స్ కూడా సినిమాకి మెయిన్ హైలెట్ గా ఉండబోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా పవర్ ఫుల్ పోలీస్ లుక్ లో ఇరగదీస్తూ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతున్నాడు. 

Nithya Menen To Team Up With Pawan Kalyan For AK Remake:

Nithya Menen to be part of Pawan Kalyan Ayyappan Koshiyum remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs