మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ కోసం ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అందులోను ఆగష్టు 9 మహేష్ బర్త్ డే. సో ఆ రోజు సర్కారు వారి పాట నుండి ట్రీట్ కంపల్సరీ అని ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. అందుకే ఫాన్స్ ని ఎక్కువ వెయిట్ చేయించకుండా టీం ఫాన్స్ కి కావాల్సిన ట్రీట్ రెడీ చేసేస్తూ అప్ డేట్ ఇచ్చేసింది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన సర్కారు వారి పాట చిత్రంతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన ఫస్ట్ హీరో. సర్కారువారిపాట సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. సర్కారువారి పాట సినిమాను ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్‌పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సర్కారువారి పాట టైటిల్, ఈ చిత్రంలో విడుదలైన మహేశ్‌బాబు ప్రీ లుక్ ప్రతి ఒక్కరి అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సర్కారువారి పాట ఫస్ట్ నోటీస్‌ను ఈ నెల 31న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సిద్ధమైయ్యారు. ఈ ఫస్ట్ నోటీస్‌లో మహేశ్‌బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో మహేశ్‌బాబు చేతిలో బ్యాగ్ పట్టుకుని ఉన్నారు. అదే విధంగా బైక్‌లు, కార్లులతో పాటు కొందమంది రౌడీలను మనం చూడొచ్చు. దీన్ని బట్టి ఈ పోస్టర్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను సంబంధించినది అని తెలుస్తుంది.