బాలకృష్ణ - బోయపాటి కాంబో BB3 మొదలైన కొత్తలో.. బాలయ్య క్యారెక్టర్ కి పవర్ ఫుల్ టైటిల్ గాడ్ ఫాదర్ అంటూ ప్రచారం జరిగింది. అంటే బాలయ్యని బోయపాటి గాడ్ ఫాదర్ గా చూపించబోతున్నాడని అన్నారు. ఫైనల్ గా ఇదే టైటిల్ అన్నారు. కానీ బోయపాటి మాత్రం బాలయ్య BB3 కి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాడు. ఇక ఇప్పుడు బాలయ్య గాడ్ ఫాదర్ టైటిల్ ని చిరు వాడేస్తున్నారనే టాక్ మొదలయ్యింది. ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా వున్న చిరు.. తదుపరి లూసిఫర్ రీమేక్ చెయ్యబోతున్నారు.
ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా లూసిఫెర్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసారు. త్వరలోనే షూటింగ్ అంటూ ప్రచారము మొదలైంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న లూసిఫెర్ రీమేక్ టైటిల్ గా రారాజు అంటూ ప్రచారం జరిగినా తాజాగా లూసిఫర్ రీమేక్ కి బాలయ్యకి అనుకున్న గాడ్ ఫాదర్ టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అంటున్నారు. చిరు కేరెక్టర్, చిరు లుక్స్ ఈ టైటిల్ కి సరిపోతాయని అందుకే మోహన్ రాజా అండ్ చిరు అదే టైటిల్ కి ఫిక్స్ అవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక చిరు 153 టైటిల్ ఆల్మోస్ట్ గాడ్ ఫాదర్ అనే అంటున్నారు. .