యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో కన్నడ లో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిలిం కెజిఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. కెజిఎఫ్ తో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ - యష్ కాంబోలో రాబోతున్న కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫాన్స్ మాత్రమే కాదు.. పలు బాషా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కెజిఎఫ్ పై ఉన్న క్రేజ్ తో చాప్టర్ 2 మీద విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే విడుదలైన కెజిఎఫ్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులకు నెలవుగా మారింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్ లాంటి నటులు నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఫాన్స్ వెయిటింగ్.
ఇక నేడు సంజయ్ దత్ పుట్టిన రోజు స్పెషల్ గా కేజిఎఫ్ టీం.. సంజయ్ దత్ అధీర పోస్టర్ ని రివీల్ చేసి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పింది. హీరో తో సమానమైన విలన్ పాత్రలో పవర్ ఫుల్ గా అధీర పాత్ర ఉండబోతుంది అని సంజయ్ దత్ లుక్ చూస్తేనే తెలిసిపోతుంది. యష్ తో పోటీకి దిగే అధీర గా సంజయ్ దత్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెజిఎఫ్ తోనే అంచనాలను తారుమారు చేసిన యశ్ అండ్ ప్రశాంత్ నీల్ లు కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఇంకెన్ని అంచనాలను నమోదు చేస్తారో చూడాలి. ఇక ఈసినిమా క్రిష్ట్మస్ బరిలో నిలవబోతుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.