రాజకీయాల నుండి పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీ అయ్యారు. రెండు రోజుల ముందే పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో మొదలైన అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూట్ రెస్యూమ్స్ మొదలవడం.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా అదరగొట్టేస్తున్న లుక్, అప్ డేట్స్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరో గా నటిస్తున్న రానా దగ్గుబాటి షూటింగ్స్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ ప్రవర్తనకి ముగ్దుడైపోతున్నాడు. ప్రెజెంట్ పవన్ - రానా కాంబో సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు.
ఇక రానా షూటింగ్ లో పవన్ ని చూసి అసలు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేసే అవకాశం వస్తుంది అని కానీ, అలాగే కలిసి నటిస్తాను అని కానీ ఎప్పుడు అనుకోలేదని చెబుతున్నాడు రానా. పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది అని, నటనలో ఆయనకి గల అనుభవం తెలిసిపోతూనే ఉంది. పవన్ ని చూడగానే ఆయన అనుభవానికి, ఆయన వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. షూటింగ్ గ్యాప్ లో పవన్ చాలా విషయాలు మాట్లడతారు. చాలా సరదాగా ఉంటారు.
ఎన్నో విషయాలపై పవన్ కి మంచి అవగాహన ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అసలు పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఓ మంచి పుస్తకం వంటివారు. షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి నేను చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అంటూ పవన్ ని తెగ పొగిడేస్తున్నాడు రానా.