Advertisement
Google Ads BL

తండ్రీ కొడుకులు అలా రికార్డ్ సృష్టించారు


కర్ణాటక ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప రాజీనామాతో కర్ణాటకకు  కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అయితే కర్ణాటకకు కొత్తగా బసవరాజ్ బొమ్మాయ్ సీఎం కావడంతో తండ్రీ, కొడుకులు సీఎంగా చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. కొత్త ముఖ్యమంత్రి తండ్రి సోమప్ప రాయప్ప బొమ్మాయ్ గతంలో అంటే 1996-98లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. సీఎంలుగా పనిచేసిన తండ్రుల బాటలో కుమారులు పయనించి వారు కూడా మళ్లీ ముఖ్యమంత్రి పీఠాలను అధిరోహించి రికార్డు సృష్టించారు. 

Advertisement
CJ Advs

కర్ణాటకలోనే కాదు.. తమిళనాడు రాష్ట్రంలో కరుణానిధి 1969-2011 సంవత్సరాల మధ్య ఐదు సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు సీఎం పీఠాన్ని కైవసం చేసుకొని తండ్రి కరుణానిధి బాటలో పయనించారు. 

ఇక ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ కూడా తండ్రి కొడుకులుగా జగన్, రాజశేఖర్ రెడ్డి లు రికార్డ్ సృష్టించారు. రాష్ట్ర సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. అతని కుమారుడు జగన్ 2019లో సీఎం అయ్యారు. 

 ఒడిశా సీఎంగా తండ్రి బిజు పట్నాయక్ రెండుసార్లు పనిచేశారు. బిజూ కుమారుడు నవీన్ పట్నాయక్ ఐదు పర్యాయాలు సీఎం అయ్యారు. జార్ఖండ్ సీఎంగా షిబూ సోరెన్ మూడు సార్లు పనిచేయగా అతని కుమారుడు హేమంత్ సోరెన్ రెండవసారి సీఎం అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లో తండ్రి డోర్జీ ఖండు, పెమాఖండులు సీఎంలుగా పనిచేశారు. 

మేఘాలయలో పీఏ సంగ్మా, కాన్రాడ్ సంగ్మాల తండ్రికొడుకులు ఉన్నత పదవులు నిర్వర్తించారు.జమ్మూకశ్మీరులో ఫరూఖ్ అబ్దుల్లా, అతని కుమారుడు ఒమర్ అబ్దుల్లాలు, ముఫ్తీ మహ్మద్ సయీద్, మెహబూబా ముఫ్తీలు సీఎంలుగా పనిచేశారు.ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ సిఎం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ మూడు పర్యాయాలు యూపీ సీఎం కుర్చీలో ఉన్నారు. 2012-17లో అఖిలేష్ ఒకేసారి సీఎం పదవిలో ఉన్నారు.

ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ తండ్రి హేమ్వతి నందన్ బహుగుణ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవి లాల్ , అతని కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా కూడా హర్యానా సీఎంలుగా పనిచేశారు. అదేవిధంగా, శంకరరావు చవాన్,అతని కుమారుడు అశోక్ చవాన్ మహారాష్ట్రలో సీఎంలుగా పనిచేశారు. 

Father and son created a record like that:

Basavaraj Bommai takes oath as Karnataka chief minister
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs