Advertisement
Google Ads BL

అమీ జాక్సన్ బ్రేకప్ స్టోరీ


కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఐ సినిమాతో విపరీతంగా పాపులర్ అయిన అమీ జాక్సన్.. హీరోయిన్ గా స్టార్ హీరోలతో నటించినా.. పెద్దగా రాణించలేక... కెరీర్ ని పక్కనపడేసి.. బాయ్ ఫ్రెండ్ తో చట్టాపట్టాలేసుకుని తిరిగింది. అంతేకాకుండా ప్రియుడు జార్జ్ పానయిటూతో ఓ బాబు కి తల్లి కూడా అయ్యింది. పెళ్లి కాకుండానే అమీ జాక్సన్ తల్లి అయ్యి.. ఆ బేబీ తో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసింది. ఇక ఇక బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసిన అమీ జాక్సన్ తన ప్రియుడితో మే నెలలో నిశ్చితార్థం చేసుకుంది. కానీ కరోనా, లాక్‌డౌన్ కారణంగా అమీ జాక్సన్, జార్జ్ పెళ్లి వాయిదా పడింది. 

Advertisement
CJ Advs

అయితే గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న అమీ జాక్సన్ కొన్నిరోజులుగా ప్రియుడు జార్జ్‌కు దూరంగా ఉంటుంది. వారిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు చోటు చేసుకోవడంతో వారి సహజీవనంలో కలతలు రేగాయి. అయితే తాజాగా అమీ జాక్సన్ తాన్ ప్రియుడు జార్జ్ తో బ్రేకప్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అమీ జాక్సన్ కూడా సోషల్ మీడియాలో ప్రియుడు ఫొటోస్ డిలేట్ చెయ్యడంతో..  అమీ బ్రేకప్ వార్తలకు బలం చేకూరినట్లయింది. బ్రేకప్ మేటర్ పబ్లిక్ గా బయటపెట్టకుండా.. తన కొడుకుతో సైలెన్స్ మెయింటింగ్ చేస్తున్న అమీ జాక్సన్ ప్రస్తుతం కెరీర్ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. 

Amy Jackson Break up Story:

Did Amy Jackson break up with fiance George
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs