Advertisement
Google Ads BL

సల్మాన్ ని పొగుడుతున్న టాప్ హీరోయిన్


టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ఫుల్ బిజీ. తెలుగులో ఆచార్య, మోస్ట్ బ్యచులర్, పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ లో నటిస్తున్న పూజ హెగ్డే తమిళ బీస్ట్ లో నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ చిత్రాలతో బిజీ అయిన పూజ హెగ్దే సల్మాన్ ఖాన్ ని తెగ పొగిడేస్తోంది. సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వం సూపర్ అంటూ కితాబునిచ్చేస్తుంది. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిత్వాలకు ముసుగు వేసుకుంటారు. కానీ సల్మాన్‌ఖాన్‌ ది అలాంటి మనసత్వం కాదు. సల్మాన్ తనకు నచ్చితే నచ్చినట్టుగా ఉంటాడు. నచ్చలేదు అంటే నచ్చనట్టు ఉంటాడు. అంత మంచి వ్యక్తిత్వం సల్మాన్ ది.  

Advertisement
CJ Advs

అలాంటి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, అసలు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో అనే సంశయాలు లేకుండా నిజాయితీగా, ముక్కుసూటిగా తమకు నచ్చినట్టు ఉండగలగడం అనేది చాలా గ్రేట్‌ అంటూ సల్మాన్‌ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. మరి సల్మాన్ ఖాన్ తో భైజాన్‌ అనే మూవీ చేస్తుంది. త్వరలోనే ఆ మూవీ పట్టాలెక్కబోతుంది. 

Top heroine praises Salman:

Pooja Hegde praises Salman Khan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs