హీరోయిన్స్‌ని హై ప్రొఫైల్ వేశ్యలుగా చూస్తున్నారు


సినీ ఇండస్ట్రీ చూడడానికి పైకి మేకప్ వేసుకున్న హీరోయిన్‌లా ఎంతో అందంగా కనిపిస్తుంది కానీ.. ఆ అందం వెనుక ఎన్నో రహస్యాలు ఉంటాయని, కొందరికిది కన్నీళ్ల ప్రపంచం అయితే, మరికొందరికిది ఆటాడుకునే వస్తువులాంటిదనే సందర్భాలు ఇప్పటి వరకు ఎన్నో బహిర్గతం అయ్యాయి. సినీ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో ఈ మధ్యకాలంలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘మీటూ’, ‘క్యాస్టింగ్ కౌచ్’ అంటూ వెండితెర వెనుక జరుగుతున్న అసాంఘిక చర్యలు, ఆడవాళ్ల వేదనలు, రోదనలు రివీలవుతున్నాయి. అయితే ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే.. ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా ఇబ్బంది పడే ఉంటారని అంటోంది నటి మహికా శర్మ. హీరోయిన్లు అంటేనే హై ప్రొఫైల్ వేశ్యలు అన్నట్లుగా చూస్తున్నారనేలా ఆమె చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

 

ఆమె రీసెంట్‌గా ఓ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘ఈ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో పేరు రావాలంటే ఏదో ఒకటి త్యాగం చేయక తప్పదు. ఇక్కడ మహిళలు ఆట వస్తువుల కింద సమానం. వారిని లైంగికంగా చూస్తారే తప్ప.. మానవత్వం, జాలి వంటివి ఇక్కడ ఉండవు. కొందరు అవకాశాలు ఇస్తామని లోబరుచుకుంటే.. ఇంకొందరు బలవంతం చేస్తుంటారు. అన్నీ వదిలేసి ఇదే ప్రపంచం అని వచ్చిన అమ్మాయిలు ఎవరో ఒకరికి బలి కావాల్సిందే. అసలు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేని అమ్మాయిలు అయితే.. వారి బతుకు కుక్కలు చింపిన విస్తరే. ఇంకా చెప్పాలంటే హీరోయిన్లను ఇక్కడ హై ప్రొఫైల్ వేశ్యలుగా చూస్తుంటారు. ఈ విధానం మారితేనే మహిళలకు గుర్తింపు వస్తుంది..’’ అని చెప్పుకొచ్చింది. మహిక శర్మ విషయానికి వస్తే.. రామాయణ, ఎఫ్ఐఆర్ వంటి పలు టీవీ సీరియళ్లలో నటించిన విషయం తెలిసిందే.

People here think we actresses are high profile prostitutes Says Mahika Sharma:

Mahika Sharma sensational Comments on Cine Industry
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES