Advertisement
Google Ads BL

మా సినిమాలో రెజినా లేదు


రెజినా కాసాండ్రా ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోయినా.. తమిళనాట బిజీ గా ఉంటుంది. అయితే ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన రేజీనాకి టాలీవుడ్ లో ప్రస్తుతం ఆఫర్స్ నిల్. తాజాగా రెజినా బెల్లంకొండ శ్రీనివాస్ -  వినాయక్ కాంబోలో మొదలైన బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ తో రెజీనా హిందీకి వెళ్లబోతుంది అంటూ జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఛత్రపతి రీమేక్ టీం రెజినా బెల్లంకొండ సరసన హీరోయిన్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించింది. ఛత్రపతి రీమేక్ షూట్ ఈ మధ్యనే మొదలు పెట్టామని, ఇంతవరకు బెల్లంకొండ సరసన హీరోయిన్ గా ఎవరిని అనుకోలేదని, రెజీనాని ఎంచుకున్నామ‌న్న వార్త‌ల‌లో నిజం లేద‌ని తేల్చేసింది. అయితే ఛత్రపతి హిందీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ‌ని ఎంచుకోవాల‌న్న‌ది ప్రొడ్యూసర్స్ ఆలోచన. పేరున్న హీరోయిన్ నే ఈ సినిమాలోకి తీసుకోవాలని, ఒకవేళ ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ ని తీసుకున్నా ఓ 35 రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చేలా ఉండాలని చిత్ర బృందం చెబుతుంది. మరి బెల్లం బాబు కి బాలీవుడ్ లో ఏ హీరోయిన్ తగులుతుందో చూడాలి. 

Regina is not Part of Chatrapati remake:

Chatrapathi remake team confirms regina is not a part of the movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs