Advertisement
Google Ads BL

పవన్ - రానా ఏకే రీమేక్ షూట్ రెస్యూమ్స్


గత పది రోజులుగా రాజకీయాల్లో యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్.. తాజాగా సినిమా షూటింగ్స్ కి హాజరవుతున్నారు. ఆయన నటిస్తున్న ఏకే రీమేక్ అలాగే క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు షూటింగ్స్ కోసం సిద్దమవడమే కాదు.. నేడు అఫీషియల్ గా రీమేక్ షూట్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. అయ్యప్పన్ కోషియం రీమేక్ నుండి సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడంతో.. మళ్ళీ కొత్త కెమేరామ్యాన్ తో షూటింగ్ మొదలు పెట్టడానికి కాస్త టైం తీసుకున్న సాగక కె చంద్ర.. నేడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్ లో ఏకే రీమేక్ రెస్యూమ్ షూట్ మొదలు పెట్టారు. 

Advertisement
CJ Advs

హీరో రానా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. పవన్ - రానా కాంబో సీన్స్ ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తారని, అలాగే భారీ యాక్షన్ సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నేడు షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన టీం #BheemlaNayak is back on duty అంటూ పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో ఉన్న బ్యాక్ లుక్ ని కూడా పరిచయం చేసేసారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గాను, ఈగో ఉన్న వ్యక్తిగా రానా మధ్యన ఫైట్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అవ్వబోతున్నాయని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ భార్యగా నిత్య మీనన్ నటిస్తుండగా.. రానా వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. 

Pawan - Rana Ayyappanum Koshiyum shoot resumes:

Pawan Kalyan, Rana Daggubati finally resume shoot Ayyappanum Koshiyum
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs