Advertisement
Google Ads BL

కన్నీటి పర్యంతమైన శిల్పా శెట్టి


రేపటి వరకు పోలీస్ కష్టడీలో ఉండనున్న రాజ్ కుంద్రా అరెస్ట్ వలన వచ్చిన సమస్యలతో రాజ్ కుంద్రా భార్య ప్రముఖ నటి శిల్పా శెట్టి కన్నీటి పర్యంతమవుతుంది. అస్లీల చిత్రాలను చిత్రీకరించి, యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని రాజ్ కుంద్రా ని పోలీస్ లు అరెస్ట్ చేసి, విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాజ్ కుంద్రా ఇంటిని సోడా చేసి కీలక ఆధారాలను కనుగొన్న ముంబై పోలీస్ లు శిల్ప శెట్టి ని ప్రశ్నల వర్షంలో తడిపేసారు. అయితే శిల్ప శెట్టి ని విచారిస్తున్నప్పుడు రాజ్ కుంద్రా ఎలాంటి తప్పు చెయ్యలేదని, ఈ అరెస్ట్, ఆరోపణల వలన పరువు పోవడమే కాదు.. పోర్న్ లేదా అశ్లీల చిత్రాల నిర్మాణంలో అసలు తాను పాల్గొనలేదని, అలాగే తన భర్త నిర్దోషి అని చెప్పిన ఆమె ఈ కేసు వల్ల తమ చేతిలో ఉన్న చాలా ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యాయని, అంతేకాకుండా ఆర్ధికంగానూ తీవ్రంగా నష్టపోయామని చెప్పి శిల్పా శెట్టి ఎమోషనల్ అయినట్లుగా చెబుతున్నారు. 

Advertisement
CJ Advs

రాజ్ కుంద్రాని విచారణ నిమిత్తం కుంద్రా ఇంటికి తీసుకొచ్చినప్పుడు..  శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తో గొడవకు దిగినట్లుగా తెలుస్తుంది. ఇక రెండు గంటల పాటు శిల్పా శెట్టి ని విచారించిన పోలీస్ లు ఆమె వాంగ్మూలన్ని రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక రేపటితో రాజ్ కుంద్రా పోలీస్ కష్టడి ముగియనుంది. రాజ్ కుంద్రా బెయిల్ కోసం ఆయన తరుపు లాయర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. 

Shilpa Shetty got into heated arguement with her husband, Shilpa cries in front of police:

Shilpa Shetty Crying as her Husband Raj Kundra is Arrested
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs