Advertisement
Google Ads BL

శ్యామ్‌సింగ రాయ్‌ ని ఫినిష్ చేసిన నాని


నాని రీసెంట్ మూవీ టక్ జగదీశ్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే తెలంగాణ లో థియేటర్స్ ఓపెన్ అయ్యి.. సినిమా ఇండస్ట్రీలో ఆశలు చిగురిస్తున్నాయి. అలాగే ఏపీలోనూ 100 శాతం అక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ అయితే సినిమా రిలీజ్ డేట్స్ వరసపెట్టేలా ఉన్నాయి. ఇక నాని కూడా అందుకే టక్ జగదీశ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నాని తదుపరి మూవీ శ్యామ్ సింగ రాయ్ కూడా సెట్స్ మీదే ఉంది. సెకండ్ వేవ్ మొదలయ్యేవరకు శరవేగంగా షూటింగ్ చేసుకున్న శ్యామ్ సింగరాయ్.. పోస్ట్ కరోనా షూట్ మొదలవడం ఫినిష్ అవడం జరిగిపోయింది. 

Advertisement
CJ Advs

కోవిడ్‌ సెకండ్‌ వేవ్, భారీ ఈదురు గాలులు, వర్షాలు శ్యామ్‌సింగరాయ్‌ సెట్స్‌ను నాశనం చేయగలిగాయి కానీ షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ కాకుండా ఆపలేకపోయాయి. అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొని న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన శ్యామ్‌సింగ రాయ్‌ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను శరవేగంగా జరుపుతున్నామని చిత్రయూనిట్‌ సగర్వంగా తెలిపింది. వెండితెరపై శ్యామ్‌సింగరాయ్‌ సినిమా ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు గ్రాఫిక్స్‌ టీమ్‌ శక్తివంచన లేకుండా హై ఎండ్ టెక్నాల‌జీతో పని చేస్తున్నారు. దీంతో శ్యామ్‌సింగరాయ్‌ కథ, కథనాల పరంగానే కాదు.. విజువల్‌ పరంగా కూడా అత్యద్భుతంగా ఉండబోతుంది.

శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. ఔట్‌పుట్‌ పట్ల నేను మా టీమ్‌ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. మేం అనుకున్న సమయంలో షూటింగ్‌ పూర్తిచేయడానికి పూర్తి సహాకారం అందించిన యూనిట్‌ కి కృతజ్ఞతలు అని నిర్మాత వెంకట్‌ బోయనపల్లి అన్నారు. పశ్చిమబెంగాల్‌లో నాని శ్యామ్‌సింగరాయ్‌ లాంగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. బెంగాల్‌ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతంగా వేసిన టెంపుల్‌ సెట్‌లో కొన్ని ప్రధానమైన, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Nani Shyam Singha Roy Shooting Completed:

Hero Nani Shyam Singha Roy Movie Shooting Completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs