నిన్న టోక్యో ఒలింపిక్స్ లో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించడం, ఇవాళ ప్రపంచ చాంపియన్ షిప్ లో ప్రియా పసిడి సంబరం భారత క్రీడాభిమానులను ఉప్పొంగిపోయేలా చేస్తున్నాయి.
హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ స్వర్ణం సాధించింది. 73 కిలోల విభాగంలో పోటీపడిన ప్రియా ఫైనల్లో బెలారస్ కు చెందిన క్సెనియా పటాపోవిచ్ పై 5-0తో గెలుపొందింది.ఈ నేపథ్యంలో ప్రియా మాలిక్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తో సహా ప్రతి పక్షనాయకులు చంద్ర బాబు, ఇంకా సినిమా సెలబ్రిటీస్, రాజకీయనాకులు అభినందించారు. దేశానికి మరో పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఏపీ సీఎం జగన్.. హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున బంగారు పతకం సాధించినందుకు ప్రియా మాలిక్‌కు నా హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. టోక్యో నుంచి బుడాపెస్ట్ వరకు ప్రపంచ వేదికపై భరతమాత పుత్రికలు మనందరినీ గర్వించేలా చేస్తున్నారని కొనియాడారు. హంగేరీలో జరుగుతున్న వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో ప్రియా మాలిక్ స్వర్ణం సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. కంగ్రాచ్యులేషన్స్ ప్రియా మాలిక్ అంటూ ట్వీట్ చేశారు.
57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.ప్రియా మాలిక్ విజయమై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.