Advertisement
Google Ads BL

అఫీషియల్: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో స్టార్ట్స్


ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఆయన ఫాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాధేశ్యామ్, తర్వాత ఆదిపురుష్, సలార్ షూటింగ్స్ జోరులో ప్రభాస్ మిగతా హీరోలకు చమటలు పట్టిస్తున్నాడు. మరోపక్క ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ దసరా తర్వాత మొదలవుతుంది అనుకుంటే.. నేడు హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా మొదలెట్టేసారు. ఫాన్స్ ఊరుకుంటారా గత రాత్రే ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ పూజ కార్యక్రమాలతో ఈ రోజే మొదలు కాబోతుంది అని పసిగట్టేసి గత అర్ధరాత్రి నుండి నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోని తెగ ట్రెండ్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ముంబై నుండి అమితాబచ్చన్ కూడా హైద్రాబాద్ కి రావడం తో ఈ న్యూస్ మరింత హాట్ గా మారింది. అయితే ఫాన్స్ ఎక్సపెక్ట్ చేసినట్టుగానే ప్రభాస్ - నాగ్ అశ్విన్ Project - K అఫీషియల్ గా పూజ కార్యక్రమాలతో నేడు హైద్రాబాద్ లో మొదలైపోయింది. అమితాబచ్చన్ హాజరైన ఈ పూజ కి ప్రభాస్ కానీ, హీరోయిన్ దీపికా పదుకొనే కానీ హాజరైన న్యూస్ లేదు కానీ.. Project - K ని అఫీషియల్ గా మొదలు పెట్టినట్టుగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేసారు. దానితో ప్రభాస్ ఫాన్స్ గాల్లో తేలిపోతున్నారు. 

Nag Ashwin - Prabhas Project K Launched:

All about Prabhas Project K and Amitabh role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs