Advertisement
Google Ads BL

జులై 30 పైనే టాలీవుడ్ భవితవ్యం


టాలీవుడ్ లో థియేటర్స్ మూతబడి మూడు నెలలు కావొస్తుంది. కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ సిట్యువేషన్ ముగిశాక తెలంగాణాలో నిన్న జులై 23 నుండి 100 శాతం అక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ఏపీలో 50 పర్సెంట్ అక్యుపెన్సీతో థియేటర్స్ రన్ అవుతున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయిన ఉత్సాహంలో టాలీవుడ్ యంగ్ హీరోస్ సత్య దేవ్ తిమ్మరుసు రిలీజ్ డేట్ ప్రకటించారు. జులై 30 న తిమ్మరుసు థియేటర్స్ నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Advertisement
CJ Advs

అదే రోజు మరో యంగ్ హీరో తేజ సజ్జ లవ్ స్టోరీ ఇష్క్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ సోషల్ మీడియాలో జోరుగా మొదలయ్యాయి. జులై 30 న రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల స్పందన చూసాక మిగతా మూవీ రిలీజ్ డేట్స్ బయటికొస్తాయి. తిమ్మరుసు, ఇష్క్ మూవీస్ కి ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీసు గలగలలు చూసి మిగతా సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి ముందు వస్తారు. 

ముఖ్యంగా నాగ చైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీశ్ సినిమాల రిలీజ్ డేట్స్ ముందు బయటికి వస్తాయి. అంటే ఇప్పుడు టోలీవుడ్ భవితవ్యం మొత్తం జులై 30పైనే అంటే జులై 30 రిలీజ్ కాబోతున్న సినిమాలపైనే ఆధారపడి ఉంది అన్నమాట. 

The future of Tollywood is on July 30th:

Timmarusu and Ishq to Release on July 30th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs