Advertisement
Google Ads BL

రాధేశ్యామ్ గుట్టు విప్పిన పూజ


ప్రభాస్ రీసెంట్ మూవీ రాధేశ్యామ్ అసలైతే ఈ నెలాఖరున విడుదల కావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఫాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈమధ్యనే రాధేశ్యామ్ షూట్ రెస్యూమ్ మొదలైంది. ప్రభాస్ - పూజ హెగ్డే రాధేశ్యామ్ ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొనడము పూజ తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసుకుని విజయ్ బీస్ట్ సెట్స్ లో వాలిపోవడము అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే రాధేశ్యామ్ అప్ డేట్ కోసం ఫాన్స్ తెగ వెయిట్ చెయ్యడమే కాదు.. నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా పూజ హెగ్డే రాధే శ్యామ్ గుట్టు విప్పింది. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ తుది దశలో ఉంది అని, మరో వారం పది రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి ప్రభాస్ ఫాన్స్ కి క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత మేకర్స్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని చెప్పిన పూజ హెగ్డే తన సినిమాపై ఇంట్రెస్టింగ్ గా ఓ చిన్న అప్ డేట్ ఇచ్చింది. 

తన పాత్ర ముచ్చట్లను.. సినిమా విడుదలకు ముందు రివీల్ చేస్తాను అని.. చెప్పిన పూజ రాధే శ్యామ్ మెచ్యూర్‌ లవ్ స్టోరీ అని మాత్రం చెప్పగలను అని అంటుంది. ఇక ప్రభాస్ న బాహుబలి వంటి యాక్షన్‌ చిత్రం తర్వాత రొమాంటిక్‌ కోణంలో చూడటం చాలా ఆసక్తిగా ఉంటుంది అని.. ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో తాను అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నా అంటూ రాధే శ్యామ్ గుట్టు విప్పింది. 

Radhe Shyam update by Pooja Hegde:

Pooja Hegde gives an update on Radhe Shyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs