పుష్ప సినిమా షూటింగ్ మంచి స్పీడుగా జోరుగా సాగుతున్న సమయంలో అల్లు అర్జున్ కరోనా బారిన పడడం, వెంటనే సెకండ్ వేవ్ రావడంతో పుష్ప షూటింగ్ ఆపాల్సి వచ్చింది. ఇక గత వారంలోనే అల్లు అర్జున్ అండ్ టీం పుష్ప రెస్యూమ్ షూట్ హైదరాబాద్ లోనే మొదలు పెట్టారు. మధ్యలో భారీ వర్షాలతో పుష్ప షూటింగ్ కి అంతరాయం కలిగింది. ఇక ఫహద్ ఫాజిల్ కూడా పుష్ప సెట్స్ లో జాయిన్ అవ్వడానికి ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా పుష్ప షూటింగ్ మరోసారి క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దర్శకుడు సుకుమార్ కి అస్వస్థత కారణముగా పుష్ప షూటింగ్ ఆగిపోయినట్లుగా తెలుస్తుంది.
కొన్ని రోజులుగా సుకుమార్ కి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట. అయితే సుకుమార్ జ్వరం తగ్గేవరకూ పుష్ప షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిందట టీం. సుకుమార్ కి ఫీవర్ తగ్గాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పేలా లేదంటున్నారు. ఎందుకంటే సుకుమార్ ఇంగ్లీష్ మెడిసిన్ కి దూరమట. అంటే ఆ ప్లేస్ లో హోమియో మెడిసిన్ వాడతారట. ఇప్పుడు కూడా సుకుమార్ హోమియో మెడిసిన్ వాడుతుండడంతో ఆ జ్వరం కాస్త తగ్గినా కొన్ని రోజులు రెస్ట్ లో ఉండాలట. అందుకే సుకుమార్ కోలుకునేవరకు పుష్ప షూటింగ్ కి బ్రేకిచ్చేసారట. మరి అల్లు అర్జున్ - సుకుమార్ తో షూటింగ్ కోసం అటు ఫహద్ ఫాసిల్ ఎగ్జైట్ అవుతున్న విషయం తెలిసిందే.