ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్ లో రాధేశ్యామ్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ కాగానే.. ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబై కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆదిపురుష్ - సలార్ మూవీ షూటింగ్స్ పారలల్ గా చెయ్యబోతున్న ప్రభాస్.. తన తదుపరి చిత్రం నాగ్ అశ్విన్ తో చెయ్యాలి. నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ ప్రకటించే ఏడాది గడిచిపోయింది. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ గా ఉండబోతుంది అంటూ ప్రచారం గట్టిగా జరుగుతుంది. అలాగే భారీ కాదు అతి భారీ బడ్జెట్ తో ఈ మూవీని అశ్విని దత్ నిర్మిస్తున్నారని అంటున్నారు.
అయితే తాజాగా నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ లాంఛనంగా పూజ కార్యక్రమాలతో ఈ రోజే మొదలు కాబోతుంది అంటూ గత అర్ధరాత్రి నుండి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లతో ట్రెండ్ అవుతుంది. అమితాబ్ కూడా హైదరాబాద్ కి ఈ మూవీ పూజ కార్యక్రమాల కోసమే రాబోతున్నారని రచ్చ రచ్చ చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. అసలు వైజయంతి మూవీస్ కానీ, నాగ శ్విన్ కానీ, ప్రభాస్ పిఆర్ టీం కానీ.. ఈ ముచ్చట సోషల్ మీడియాలో ప్రకటించలేదు. కానీ అమితాబ్ హైదరాబాద్ రాక మాత్రం ఈ మూవీ పూజ కోసమే అన్నటున్నారు.
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబో మాత్రం సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది. ఇక ఈ పూజ కార్యక్రమాలను సైలెంట్ గా నిర్వహించి.. ఆ తర్వాత అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే ప్రభాస్ కి జోడిగా ఎంపికైన విషయం తెలిసిందే.