Advertisement
Google Ads BL

నారప్పకి మెగాస్టార్ రివ్యూ


విక్టరీ వెంకటేష్ తమిళ అసురన్ మూవీని తెలుగులో నారప్ప గా రీమేక్ చెయ్యడం, థియేటర్స్ లో కాకుండా ఓటిటి నుండి నారప్ప ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం జరిగింది. మొదటి నుండి భారీ అంచనాలున్న నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. వెంకీ నారప్ప లుక్స్, నారప్పగా వెంకీ పెరఫార్మెన్స్ కి ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు కూడా జై జైలు కొడుతున్నారు. అయితే వెంకిమామ నారప్ప మూవీ చూసి సమంత అక్కినేని వెంకీ నారప్ప సూపర్ అంటూ కితాబునిచ్చేసింది. 

Advertisement
CJ Advs

తాజాగా మెగాస్టార్ చిరు వెంకీ నారప్పని వీక్షించి ఆయన తనదైన స్టయిల్లో నారప్పని, వెంకీని పొగిడేశారు. నేను ఇప్పుడే నారప్ప చూశాను. వాట్ ఏ పెరఫార్మెన్స్, వాట్ ఏ ట్రాన్సఫర్మేషన్... నాకు ఎక్కడా వెంకటేష్ కనిపించలేదు. నారప్పే కనిపించాడు. టోటల్ గా కొత్త వెంకటేష్ ని చూస్తున్నా. పాత్రని ఎంతగానో అర్ధం చేసుకుని ఎంత డెప్త్ తో నటించావో వెంకీ..  నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపనతో, తాపత్రయంతో ఉంటాడు. అలాంటి వాటికి ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ. నీకు మంచి సంతృప్తిని ఇచ్చే సినిమా. ఈ సినిమా మీకు మంచి పేరుతొ పాటు, కెరీర్ లో గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది.. నారప్ప వెంకీ. ఒన్స్ ఎగైన్ కంగ్రాట్స్ టు యు అండ్ ఎంటైర్ టీం అంటూ మెగాస్టా చిరు వెంకీ ని పొగుడుతూ నారప్ప రివ్యూ ఇచ్చేసారు. 

Megastar Chiru Review for Narappa:

Megastar Applauds Venkatesh Narappa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs