Advertisement
Google Ads BL

ఆగస్టు 16 నుంచి ఏపీ స్కూల్స్ ప్రారంభం


ఏపీలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రద్దయిన ఇంటర్, 10th పరీక్షా ఫలితాలని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా చెప్పిన విద్యాశాఖామంత్రి ఇప్పుడు కరోనా తగ్గుదలతో  పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చెపాప్రు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆగస్టు  16 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని చెప్పారు. 

Advertisement
CJ Advs

అదే రోజున నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని ఆయన అన్నారు. నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు మంచి విద్యావ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ఆగస్టు 16న నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరిస్తామని పేర్కొన్నారు. టీచర్స్ అందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. 

AP School starts August 16th:

 Schools in Andhra Pradesh to reopen on August 16 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs