Advertisement
Google Ads BL

భర్త అరెస్ట్ పై శిల్పా శెట్టి ఫస్ట్ రియాక్షన్


బాలీవుడ్ ని షేక్ చేస్తున్న బ్లు ఫిలిమ్స్ కేసులో అరెస్ట్ అయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పై మరిన్ని కేసులు పెట్టారు ముంబై పోలీస్ లు. ముంబై పోలిస్ అధికారులకి లంచం ఇవ్వడం దగ్గర నుండి, నీలి చిత్రాల బిజినెస్ తో కోట్లు గడించిన రాజ్ కుంద్రా ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. రాజ్ కుంద్రా అరెస్ట్ పై కొంతమంది మాజీ హీరోయిన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే భర్త అరెస్ట్ పై నటి శిల్పా శెట్టి కాస్త గుంభనంగానే ఉంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఆ కేసులో శిల్ప శెట్టి ప్రమేయంపై పోలీస్ లు ఆరా తీస్తున్నారు. అయితే భర్త అరెస్ట్ పై శిల్ప రియాక్షన్ కోసం బాలీవుడ్ మీడియా కాచుకుని కూర్చుంది. 

Advertisement
CJ Advs

తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్ పై శిల్ప శెట్టి ఇన్స్టాగ్రమ్ వేదికగా స్పందించింది. రచయిత జేమ్స్ థర్బర్ కొటేషన్‌ను వాడుతూ.. ఆవేశంలో గతం ఎలాంటిదో ఓ అంచనాకి రావొద్దు, అలాగే భయంతో ఫ్యూచర్ ని చూసుకోవద్దు. అయితే ఎప్పుడూ నీ చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన కల్పించుకో అంటూ తనెంతగా ఎమోషన్ అవుతున్నానో చెప్పకనే చెప్పింది శిల్పాశెట్టి . అంతేకాకుండా లుకింగ్ ఎరౌండ్ అనే టైటిల్‌తో ఉన్న ఓ పుస్తకంలోని పేజీని స్క్రీన్ షాట్ తీసి సోషల్ ఇండియాలో షేర్ చేసింది. ఇక శిల్ప శెట్టి యోగ ప్రియురాలు. అదే అర్ధం వచ్చేలా..  నేను ఇంకా బ్రతికే ఉన్నానని భావించడానికి దీర్ఘమైన శ్వాసను తీసుకొన్నాను. 

ఇదివరకు కూడా ఎన్నో సవాళ్లను అధిగమించాను. ఇక మీదట కూడా సవాళ్లను అధిగమించి మనుగడతో ఉంటాను. ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసి కంగారు గానీ, భయం కానీ,ఆందోళన గానీ చెందను అంటూ ఎమోషనల్ గా భర్త అరెస్ట్ పై ట్వీట్ చేసింది శిల్పా శెట్టి. 

Shilpa Shetty first reaction to her husband Raj Kundra arrest:

Shilpa Shetty first post after Raj Kundra arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs