Advertisement
Google Ads BL

అరెస్ట్ అవ్వకుండా లంచం ఇచ్చాడా.. హతవిధీ


బాలీవుడ్ లో శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ ప్రకంపనలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాజ్ కుంద్రా అరెస్ట్ పై పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా లాంటి నటీమణులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. గేహన వసిష్ఠ లాంటి నటీమణులు రాజ్ కుంద్రా మంచి వాడు అంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. మరోపక్క రాజ్ కుంద్రా అరెస్ట్ పై శిల్ప శెట్టి స్పందన కోసం మీడియా వెయిటింగ్. బ్లు ఫిలిమ్స్ చిత్రీకరించి, యాప్స్ లో రిలీజ్ చేసిన కేసులో రాజ్ కుంద్రా అడ్డంగా ఇరుక్కున్నట్టే కనబడుతుంది వ్యవహారం. 

Advertisement
CJ Advs

ఆయనపై రోజుకో కేసు నమోదు అవుతుంది. ఫిబ్రవరిలోనే ఈ కేసు తన మెడకి చుట్టుకుని అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు రాజ్ కుంద్రా పోలీస్ లకి లంచం ఇచ్చాడంటూ.. ఈ కేసులో మెయిన్ ముద్దాయిగా ఉన్న యశ్‌ ఠాకూర్‌ మార్చి నెలలో ఏసీబీకి మెయిల్ పెట్టినట్లుగా తెలుస్తుంది. రాజ్ కుంద్రా కూడా డైరెక్ట్ గానే పోలీస్ లకి లంచం ఇచ్చారని, తాను అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు, ఈ కేసులో తన పేరు లేకుండా చేసుకునేందుకు రాజ్‌కుంద్రా అప్పట్లో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ..25 లక్షలు లంచంగా ఇచ్చారంటూ ఓ న్యూస్ బి టౌన్ లో చక్కర్లు కొడుతోంది. 

Raj Kundra Paid 25 Lakh Bribe To Crime Branch To Avoid Arrest:

Raj Kundra paid Rs 25 lakh bribe to evade arrest, say reports
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs