Advertisement
Google Ads BL

బాలకృష్ణ ఎవరు?


నిన్న ఉదయం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ ఫాన్స్ నందమూరి బాలకృష్ణ ని ఆడుకుంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఏ ఆర్ రెహ్మాన్ అంటే ఎవరో తెలియదు అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు బాలకృష్ణ ని రెహ్మాన్ ఫాన్స్ ఆడుకుంటున్నారు. టాప్ మోస్ట్, ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ ఎవరో తెలియదని బాలకృష్ణ అనడం ఏమిటి అంటూ ఆయన ఫాన్స్ బాలకృష్ణ ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఆదిత్య 369 వచ్చి మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరి స్టయిల్ వాళ్ళకి ఉంటుంది అని, ఇళయరాజా మ్యూజిక్ అద్భుతం అని, ఏ ఆర్ రెహ్మాన్ ఎవరో తనకి తెలియదని బాలకృష్ణ చెప్పారో.. లేదో.. ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ తెలియదా అంటూ ఫాన్స్ విరుచుకుని పడుతున్నారు. మ్యూజిక్ లవర్స్ అంతా,  అలాగే తమిళ తంబీలు బాలయ్యని ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్ లో #whoisbalakrishna హాష్ టాగ్ తో విరుచుకుపడుతున్నారు. బాలయ్య ఎవరో తమకి తెలియదని, అసలు బాలకృష్ణ ఎవరు అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

ఇక బాలయ్య ఫాన్స్ ఊరుకుంటారా.. #whoisbalakrishna బాలకృష్ణ ఎవరంటే.. క్యాన్సర్ పేషేంట్స్ కి హెల్ప్ చేసే హీరో, నటసింహం బాలయ్య అంటూ ఫాన్స్ బాలయ్యని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఆర్ రెహ్మాన్ ఫాన్స్ vs బాలయ్య ఫాన్స్ అన్న రేంజ్ లో సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతుంది. 

Who Is Balakrishna Hashtag trends in Twitter:

Whoisbalakrishna hashtag on Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs