రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగాతెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ కాంట్రవర్సీలకు నెలవుగా మారినప్పటికీ.. దానిని ఎలా హ్యాండిల్ చెయ్యాలో రాజమౌళికి తెలుసు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అల్లూరిగా రామ్ చరణ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ కొమరం భీం వీడియో లో ఓ షాట్ లో ఎన్టీఆర్ ముస్లిం టోపీ ని ధరించడంపై అప్పట్లోనే పెద్ద రచ్చ జరిగింది. కొమరం భీమ్ వారసులతో పాటు, చరిత్రకారులు కూడా ఈ ముస్లిం టోపీ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు చరిత్రలో కొమురం భీమ్ ఎప్పుడూ ముస్లిం టోపీని ధరించలేదని వారు అంటున్నారు.
అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఆర్.ఆర్.ఆర్ మూవీ విషయాలను మట్లాడుతూ.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర ఎందుకు ముస్లిం టోపీ ధరించి ముస్లిం యువకుడిగా మారాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. కొమరం భీం ని పట్టుకోవడానికి నిజాం ప్రభువులు.. భీం ని వెంటాడారని, నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొమురం భీమ్ ఇలా ముస్లిం యువకుడిగా మారాడని, ముస్లిం టోపీ ధరించి వారికి చిక్కకుండా ఉన్నాడని చెప్పారు. అంతేకాకుండా రామ్ చరణ్ సీతారామరాజు గా పోలీసు పాత్రలో చూపించడానికి కూడా ఒక కారణం ఉందని.. వెండితెరపై అది ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది అంటూ ఆర్.ఆర్.ఆర్ పై మరింతగా అంచనాలు పెంచేశారు రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు.