మహేష్ బర్త్ డే టైం దగ్గర పడుతుండడంతో.. మహేష్ ఫాన్స్ ఆయన సినిమాల సర్ప్రైజెస్ కోసం కాచుకుని కూర్చున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. అసలైతే మహేష్ బాబు తండ్రి కృష్ణ బర్త్ డే అంటే మే 31 నే మహేష్ రీసెంట్ మూవీ సర్ప్రైజ్ వస్తుంది అని ఆశ పడిన ఫాన్స్ కి సెకండ్ వేవ్ వలన నిరాశ చెందారు. ఇక మహేష్ బర్త్ డే వరకు వెయిట్ చెయ్యాల్సిందే అని డిసైడ్ అయ్యారు. మే 31 నే మహేష్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమాలు కూడా జరిగేవే. కానీ సెకండ్ వేవ్ అన్ని ఆపేసింది.
అయితే ఇప్పుడు ఆగష్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ అలాగే మహేష్ - త్రివిక్రమ్ కాంబో మూవీ పూజ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని తెలుస్తుంది. అంటే మహేష్ ఫాన్స్ కి ఆయన బర్త్ డే స్పెషల్ గా డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా తెలిసేసరికి ఫాన్స్ ఎక్కడా ఆగడం లేదు. ఇక రాజమౌళి ప్రాజెక్ట్ అప్ డేట్ కోసం ఆతృతగా ఉన్నా.. రాజమౌళి సంగతి తెలిసి వెనక్కి తగ్గుతున్నారు. ఆయన సినిమా మొదలయ్యేవరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వరనే సంగతి తెలిసి కామ్ అవుతున్నారు కానీ.. లేదంటే విషయం వేరేలా ఉండేది.